Pages

Recipes


సగ్గు బియ్యం వడలు



కావలసిన పదార్థాలు:
* సాబుదానా (సగ్గుబియ్యం): 1cup,
* ఆలూ: 1(ఉడికించి పొట్టుతీసినది),
* పచ్చిమిర్చి: 8,
* ఉప్పు: రుచికి సరిపడ,
* నూనె: వేయించడానికి సరిపడ.


తయారు చేయు విధానం:
ముందుగా సగ్గుబియ్యంలో నీళ్లు పోసి కడగాలి. తరువాత అందులో నీళ్లు పోసి 2-3 గంటలు నాననివ్వాలి. నానిన తరువాత సగ్గుబియ్యం, ఆలూ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు అన్నీ ఒక బౌల్‌ లో వేసి బాగా కలుపుకోవాలి. నూనె వేడి చేయాలి. సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేతితో వత్తు కోవాలి. సన్నని మంట మీద నూనెను వుంచి వీటిని అందులో వేసి నెమ్మదిగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ప్లేటులో పేపర్‌ నాప్‌కిన్‌ వేసి దానిపై వేయించిన వడలు వేసుకోవాలి. ఎక్కువగా వున్న ఆయిల్‌ అది పీల్చుకుంటుంది.


బాదం పాయసం




కావలసిన పదార్థాలు:


* బాదం పప్పులు: 1cup,
* పాలు: 6cups,
* పంచదార: 1cup,
* కుంకుమ పువ్వు: కొద్దిగా,
* నీళ్లు: ఒక గ్లాసు.


తయారు చేయు విధానం:
ముందుగా బాదం పప్పులను వేడి నీటిలో వేసి ఒక గంట పాటు నాననివ్వాలి. తరువాత నీటిని వంచి బాదం గింజలపై వుండే పొట్టును తీసేయాలి. తర్వాత బాదం పప్పులను మిక్సీలో వేసి, మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. అవసరం అయితే పాలు వేసుకోవాలి. తరువాత బాదం పేస్టును పాన్‌లో వేసి 5- 10 నిమిషాలు వేడి చేయాలి. తరువాత అందులో చక్కెర వేసి ఇంకొంచెం సేపు వుంచాలి. అది చిక్కగా అయిన తరువాత పాలు మొత్తం వేసి ఉడికించాలి. దీనిపైన కుంకుమపువ్వుతో అలంకరించాలి. రుచికరమైన బాదం పాయసం రెడీ..



ఆలూ టిక్కా రెసిపి



కావలసిన పదార్థాలు :
ఆలూ - మూడు
కారం - కొద్దిగా
ఉప్పు - కొద్దిగా
పచ్చిమిరపకాయలు - 2
కొత్తి మీర - కొద్దిగా
బ్రెడ్‌ - రెండు

తయారు చేయు విధానం :
ముందుగా ఆలూ ను ఉడికించుకుని మెత్తగా చేసి అందులో పచ్చి మిరపకా యలు, కొత్తిమీర ,కారం, ఉప్పు అన్ని వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను నీళ్ళలో ఒకసారి ముంచి మళ్ళి వాటర్ మొత్తం తీసేయ్యాలి. ఇప్పుడా బ్రెడ్డుని మిశ్రమంలో కలిపి దీనితో టిక్కాలను చేసి, పాన్ మీద ఆయిల్ వేసి రెండువైపులా కలర్ మారేవరకు కాల్చాలి.




ఆలూ పరాఠా రెసిపి



కావలసినవి :
బంగాళదుంపలు 2 పెద్దవి
గోధుమపిండి 3 cups
మైదా ఒక కప్
జీలకర్ర ఒక టీ స్పూన్
కారంపొడి ఒక టీ స్పూన్
గరంమసాలా ఒక టీ స్పూన్
కొత్తిమిర ఒక కట్ట
కరివేపాకు ఒక రెమ్మ
ఉప్ప ఒక టీ స్పూన్
నూనె సరిపడా
పెరుగు 3 టీ స్పూన్స్
పసుపు 1/4 టీ స్పూన్స్


తయారు చేయు విధానం :
ముందుగా బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు గోధుమపిండిలో కారంపొడి, జీలకర్ర, మైదా, గరం మసాలా,సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమిర,పెరుగు ,పసుపు,బంగాళదుంప వేసి బాగా కలిపి నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట పక్కనపెట్టు కోవాలి. తర్వాత చిన్నఉండలు చేసుకొని చపాతీల్లా చేసుకుని పెనం పి కాల్చుకోవాలి.




గుత్తి వంకాయ కర్రీ రెసిపి



కావలసిన పదార్థాలు:

లేతకాయలు - అర కేజీ
ఉల్లిపాయలు - అర కేజీ
టమోటాలు - అర కేజీ
ధనియాల పొడి - హఫ్ టీ స్పూన్
మిరప పొడి - 1 టీ స్పూన్
ఉప్పు - 2 టీ స్పూన్
పసుపు - తగినంత
ఆవాలు - హఫ్ టీ స్పూన్
కొబ్బరి: ఒకటి
అల్లం - కొద్దిగా
నూనె - 2 టీ స్పూన్
పచ్చి మిర్చి - 9
కొత్తిమీర- తగినంత
నువ్వులు - 25 గ్రాములు


తయరుచేయు విధానం:
వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకొవాలి. టమోటాలు,ఉల్లిపాయలు,చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి . వంకాయల్ని నిలువుగా గాట్లు పెట్టాలి. ఒక పాన్ లో నువ్వులు వేయించుకోవాలి. దోరగా వేగాక వాటిని మిక్సీలొ వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మిరప పొడి,ధనియాలు పొడి, పసుపు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్ని గ్రైడ్ చేసి వుంచుకోవాలి. ఈ మసాలా ముద్దలో ఉప్పు వేసి కట్ చేసి వుంచిన వంకాయల్లో పెట్టాలి. తరువాత ఒక మందపాటి గిన్నే తీసుకుని స్టౌ మీద పెట్టి నూనె పొయ్యాలి. నూనె కాగాక పోపు వేసి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఆ ముక్కలు బాగా ఉడకాలి. ఇప్పుడు ఆ గిన్నెలొ సరిపడా నీరు పోసి వంకాయలు బాగా మగ్గనివ్వాలి, చివరిలో పక్కన పెట్టిన నువ్వుల పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా నిముషం ఉంచాలి. కొత్తిమీర చల్లి అలంకరిస్తే ఊరించే గుత్తి వంకాయ కూర రెడీ.



ఆలూ పూరి రెసిపి



కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు: 5-6 ఉడికించి పొట్టుతీసి పెట్టుకోవాలి.
జీలకర్ర: 2tsp
మైదా: 5-6cups
పచ్చిమిర్చి: 4-6
కొత్తిమీర తరుగు: 1/2cup
కారం: 1tsp
బ్లాక్ పెప్పర్(మిరియాలు) : 1/2tsp
నూనె: 2-3cups
నెయ్యి: 1-2tbsp
ఉప్పు: రుచికి సరిపడా


తయారు చేయు విధానం:
1. ముందుగా ఉడికించిన, పొట్టు తీసిర పెట్టుకొన్న బంగాళాదుంపల్ని ఒక బౌల్లోనికి తీసుకొని బాగా చిదిమి పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ తీసుకొని, స్టౌ మీద పెట్టి అందులో జీలకర్ వేసి వేయించి, పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక గిన్నెలో మైదా పిండి వేసి అందులో ఉడికించి, చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను, వేయించి పెట్టుకొన్న జీలకర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కారం, బ్లాక్ పెప్పర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పూరిల పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఈ పిండిలో కొద్దికొద్దిగా పిండిని తీసుకొని బాల్స్ లా చేసి చపాతీలా వత్తి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె, నెయ్యి పోసి బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో వత్తిపెట్టుకొన్న పూరీలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తీసి సర్వింగ్ బౌల్ పెట్టుకోవాలి.


బందర్ లడ్డు


కావలసినవి:
శనగపిండి : 1 కప్పు
నెయ్యి : పావు కేజీ
జీడిపప్పు : సరిపడా
పంచదార : ఒక కప్పు
కుంకుమపువ్వు : సరిపడినంత

తయారీ విధానం :
ముందుగా శనగపిండిని తీసుకుని దానికి సరిపడా నీరు కలిపి ముద్దచేసి దానిని కారప్పూసలాగా వేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.ఇప్పుడు కారప్పూసను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దానిలో పంచదార వేసి, 1/4 th కప్పు నీటిలో కుంకుమపువ్వు వేసి ఆ నీటిని షుగర్లో కలిపి సరిపడా నీళ్ళు పోసి పాకం పట్టుకోవాలి. ఈ పాకంలో మనం తయారుచేసుకున్న పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి . తరువాత నెయ్యిలో వేయించిన జీడిపప్పులను , యాలకుల పొడిని తయారు చేసుకుని వీటిని కలుపుకున్న ముద్దలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన సైజ్ లో ఉండలుగా చేసుకోవాలి.అంతే బందర్ లడ్డులు రెడీ...


కాలీఫ్లవర్ కబాబ్



కావల్సినవి:
క్యాలీఫ్లవర్‌- 200 గ్రాములు
నూనె- పావుకప్పు,
ఉప్పు - తగినంత
మిరియాలపొడి- తగినంత.
కొత్తిమీర, పుదీనా- కొద్దిగా
వెల్లుల్లి- 5
బ్రెడ్‌ ముక్కలు- 4
బ్రెడ్‌పొడి- కప్పు,
షాజీరా- కొద్దిగా
వెన్న- 2 చెంచాలు,
పచ్చిమిర్చి- 4
బంగాళాదుంపలు- 4
ఉల్లిపాయలు- 2


తయారీ విధానం :
ముందుగా బంగాళాదుంపను ఉడికించి పైన పొట్టు తీసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, షాజీరా, అన్నింటినీ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.తరవాత క్యాలీఫ్లవర్‌ను ఉప్పు నీటిలో కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు దోరగా వేయించి మసాలా ముద్ద, ఉప్పు వేసి రెండు నిముషాల తరువాత క్యాలీఫ్లవర్‌ ముక్కలు వెయ్యాలి. బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను తడిపి నీటిని పిండి క్యాలీఫ్లవర్‌ వేపుడులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప ముద్దకు ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా వెన్న చేర్చి బాగా మిక్స్ చేసుకుని పెద్ద ఉండగా చేసుకొని మధ్యలో క్యాలీఫ్లవర్‌ ఉండలు పెట్టి కబాబ్‌ లుగా చేసి బ్రెడ్‌ పొడిలో అద్దాలి. ఇప్పుడు వీటిని పెనం మీద నూనెతో బ్రౌన్ కలర్ వచ్చెవరకు రెండువైపులా కాల్చుకోవాలి. కాలీఫ్లవర్ కబాబ్ రెడీ...



దోసకాయ దోసె



దోసకాయ దోసె కావలసిన పదార్థాలు:
దోసకాయ తురుము - 2 కప్పులు
మెంతులు - చిటికెడు
అటుకులు - అర కప్పు
బియ్యం - అర కప్పు
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత

దోసకాయ దోసె తయారు చేసే విధానం:
బియ్యం, మెంతులు, అటుకులు విడివిడిగా రెండు గంటలు నానబెట్టాలి. వీటన్నింటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే దోసకాయ తురుము వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఉప్పు కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం దోసెలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.

అరటి కబాబ్



అరటి కబాబ్ కావలసినవి:
అరటికాయలు-మూడు,
ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిర్చి-మూడు,
అల్లం-చిన్నముక్క
ఉప్పు, కారం-తగినంత,
పసుపు-చిటికెడు,
జీలకర్ర, ధనియాలపొడి-అరచెంచా
గరంమసాలా-చెంచా
మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు
నిమ్మరసం -చెంచా,
కొత్తిమీర-కొద్దిగా
నూనె-కొద్దిగా

తయారుచేసే విధానం :
అరటికాయలను బాగా ఉడికించి, పొట్టుతీసి మెత్తగా మెదపాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోవాలి. గిన్నెలోనూనె వేడయ్యాక అరటి ముద్ద దాన్లో వేయాలి. నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలు కూడా వేసేసి కలియతిప్పాలి. ఆఖర్న నిమ్మరసం చల్లి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమం చల్లారాక బాణలిలో నచ్చిన ఆకృతిలో చేసుకుని వేయించుకొంటే కబాబ్‌లు సిద్ధం.


సిమ్లా పులావ్





కావలసినవి:
బాస్మతిబియ్యం - పావు కేజీ
ఎల్లో క్యాప్సికమ్ - 1,
 రెడ్‌క్యాప్సికమ్ - 1
గ్రీన్ క్యాప్సికమ్ - 1,
స్వీట్‌కార్న్‌గింజలు - కొద్దిగా
మిరియాలపొడి - టీ స్పూన్
ఉప్పు - తగినంత,
పచ్చిబఠాణీ - కొద్దిగా
నూనె - 4 టీ స్పూన్లు
బటర్ - 2 టీ స్పూన్లు
అజినమోటో - చిటికెడు


సిమ్లా పులావ్ తయారి:
బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి.బాణలిలో బటర్ వేసి కాగాక తరిగి ఉంచుకున్న కూరగాయముక్కలు వేసి వేయించాలి.మిరియాలపొడి, ఉప్పు వేసి కొద్దిగా వేగిన తరువాత అజినమోటో వేసి కలపాలి.ఉడికించిన అన్నాన్ని ఒక పెద్ద పాత్రలో వేసి దాని మీద వేయించి ఉంచుకున్న కూరముక్కలు, మిరియాలపొడి మిశ్రమం వేసి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి.


Panner Kofta Curry



Ingredients:


Paneer -200 gms
Garam Masala -1/4 tsp
Cornflour -2 tblsp
Oil for frying
Potato - 2
Red Chili Powder - 1/2 tsp


For Gravy:
Onion - 4
Tomato -4
Bay Leaf - 1
Ghee - 2 tblsp
Coriander Leaves
Curd (Dahi) - 1/2 cup
Turmeric - 1/4 tsp
Garam Masala -1/4 tsp
Cashewnut Powder - 1/2 cup
Cumin Seed (Jeera) -1/2 tsp
Salt - 1/2 tsp
Red Chili Powder - 1/2 tsp


How to make :
Boil potatoes and peel them.Grate paneer and potatoes. Add salt, red chili powder, garam masala, cornflour and mix well. Make round balls of this mixture.Now heat oil in a pan. Fry balls in the oil till brown in color.Grind onion and tomatoes together. Chop coriander leaves very finely.Heat oil in a pan. Add cumin seed and bay leaf.Add onion, tomato paste and brown it, stirring continously.When it leaves oil add curd, cashewnut powder, salt, red chili powder, turmeric, garam masala. Stir it continously for a minute.Then add 2 cup of water.Put on the lid and simmer for 5 minutes.While serving reheat the gravy and then add koftas to it. Garnish it with chopped coriander leaves.



పన్నీర్ పులావ్ రెసిపి



కావలసిన పదార్ధాలు :
పనీర్ 100 గ్రాములు
బాస్మతి ఒక గ్లాస్
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 4
కరివేపాకు 1 రెమ్మ
కొత్తిమీర 1
పుదీనా 1 కట్ట
టమాటాలు మూడు
ఉప్పు సరిపడా
కారం 2 స్పూన్లు
పసుపు అర స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు
గరంమసాలా పొడి ఒక స్పూన్
నూనె సరిపడా లవంగాలు,చెక్క,షాజీర,బిర్యానీ ఆకు సరిపడా

తయారి విధానం:
ముందుగా బియ్యం కడిగి ఒక 15 నిముషాలు నానబెట్టుకోవాలి. తరువాత పనీర్ ముక్కలుగా కోసుకుని కొంచెం ఉప్పు,కారం, గరంమసాలా పొడి వేసి కలిపి కొంచంసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి లవంగాలు,బిర్యానీ ఆకు, షాజీర,దాల్చిన చెక్క, వేసి వేగాకా ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేగనివ్వాలి. తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత ఉడికించి పేస్ట్ చేసుకున్న టమాటమిశ్రమం, కొత్తిమిర పుదినా కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పడు పనీర్ ముక్కలు వేసి కారం,పసుపు, గరంమసాలా పొడి వేసి కలిపి రెండుగ్లాసుల నీళ్ళు పోసి బాగా మరిగాకా బియ్యం,సరిపడా ఉప్పు ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిలో కొత్తిమిరతో అలంకరించుకోవాలి. స్టీం పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి

5 comments: